మన దేశంలో క్రెడిట్ కార్డుల వాడకం తక్కువే.. 5.2 కోట్ల మందికి మాత్రమే కార్డులు

మన దేశంలో క్రెడిట్ కార్డుల వాడకం తక్కువే.. 5.2 కోట్ల మందికి మాత్రమే కార్డులు
  • అమెరికాలో 81 శాతం మందికి.. సిబిల్ రిపోర్ట్​ వెల్లడి

న్యూఢిల్లీ: మన దేశంలో ఇప్పటికీ క్రెడిట్ కార్డుల వాడకం ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని ట్రాన్స్‌‌యూనియన్ సిబిల్ మేనేజింగ్ డైరెక్టర్ భవేష్ జైన్ బుధవారం తెలిపారు. దేశంలో ప్రస్తుతం 5.2 కోట్ల మందికి మాత్రమే క్రెడిట్ కార్డులు ఉన్నాయి. 

ఇది మొత్తం 25 కోట్ల యాక్టివ్ క్రెడిట్ జనాభాలో కేవలం 25 శాతం మాత్రమే. కొలంబియాలో 62 శాతం, హాంకాంగ్‌‌లో 98 శాతం, అమెరికాలో 81 శాతం, బ్రిటన్‌‌లో 70 శాతం మంది కార్డులు వాడుతున్నారు.

గత దశాబ్దంలో బకాయిల మొత్తం 8.3 రెట్లు పెరిగి రూ.3.1 లక్షల కోట్లకు చేరింది. కార్డ్ వినియోగదారులు 5.2 కోట్లకు పెరిగారు. ప్రస్తుతం యూపీఐ, పర్సనల్ లోన్స్ వంటి ప్రత్యామ్నాయాల వల్ల క్రెడిట్ కార్డ్ పోటీని ఎదుర్కొంటున్నది. యువత, సెబీ–అర్బన్​, గ్రామాల వాసులు కూడా కార్డులు వాడుతున్నారు. 

పోర్ట్‌‌ ఫోలియో నాణ్యత మెరుగుపడింది. 91–179 రోజుల వరకు  చెల్లించని క్రెడిట్ కార్డ్ బకాయిలు గత ఏడాది 2 శాతం నుంచి ప్రస్తుత సంవత్సరంలో 1.7 శాతానికి తగ్గాయని సిబిల్​ రిపోర్ట్​ వెల్లడించింది.