భారత్, ఆసీస్ మ్యాచ్..ఫ్యాన్స్ హంగామా

భారత్, ఆసీస్ మ్యాచ్..ఫ్యాన్స్ హంగామా

భారత్, ఆసీస్ మూడో టీ-20 మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు  ఉప్పల్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ను చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి భారీగా తరలివస్తున్నారు. 

ఫ్యాన్స్ సందడి...
ఉప్పల్ స్టేడియం దగ్గర ఫ్యాన్స్ సందడి కనిపిస్తోంది. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న ఫైనల్ మ్యాచ్ను చూసేందుకు అభిమానులు చేరుకుంటున్నారు. స్టేడియం దగ్గర టీమిండియా జెర్సీలు ధరించి ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. మూడో టీ20లో భారతే గెలవాలని కోరుకుంటున్నారు. తప్పకుండా టీమిండియానే విజయం వరిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

స్టేడియంకు భారత్, ఆసీస్ ఆటగాళ్లు..
మరోవైపు మూడో టీ20 కోసం భారత , ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. పార్క్ హయత్ హోటల్ నుంచి ప్రత్యేక బస్సుల్లో ఉప్పల్ స్టేడియానికి వెళ్లారు. భారీ భద్రత నడుమ ఆటగాళ్లను పార్క్ హయత్ నుంచి స్డేడియానికి తరలించారు.