క్రికెట్ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్..ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు స్టేడియంలో ఫ్రీగా చూసే అవకాశం

క్రికెట్ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్..ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు స్టేడియంలో ఫ్రీగా చూసే అవకాశం

క్రికెట్ మ్యాచ్ లు లైవ్ ప్రసారం అంటేనే అభిమానులు పండగ చేసుకుంటారు. రూపాయి ఖర్చు లేకుండా లైవ్ చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఈ మధ్య దాదాపు చాలా మ్యాచ్ ల ప్రత్యక్ష ప్రసారం ఫ్రీగా గానే చూసే భాగ్యం అభిమానులకు దక్కింది. అయితే వాటికి మించిపోయే కిక్ ఇస్తూ స్టేడియంలో ఫ్రీగా చూసే అవకాశం ఫ్యాన్స్ కు త్వరలో దక్కనుంది. డిసెంబర్ లో భారత మహిళా జట్టు ఆడే మ్యాచ్ లన్నీ స్టేడియంలో ఒక్క రూపాయి చెల్లించకుండా దర్జాగా వెళ్లి చూడొచ్చు.

భారత మహిళల జట్టు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాపై  భారత్ లో సిరీస్ ఆడాల్సి ఉంది. డిసెంబర్ 6 నుంచి 17 వరకు ఇంగ్లాండ్ తో మూడు టీ 20 మ్యాచ్ లు, ఒక టెస్టు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ తర్వాత ఆస్ట్రేలియాతో డిసెంబర్ 21 నుంచి జనవరి 5 వరకు మూడు వన్డేలతో పాటు ఏకైక టెస్టు ఆడతారు. ఈ మ్యాచ్ లన్ని ముంబైలోని వాంఖడే, డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతాయని.. ఈ మ్యాచ్ లన్నిటికీ స్టేడియంలో ఉచిత ప్రవేశం కల్పిస్తామని  ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) మంగళవారం ప్రకటించింది. ఈ మ్యాచ్ లన్నీ సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతాయి.  

బుధవారం(నవంబర్ 29) నుండి మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో భారత్ మహిళల A జట్టు ఇంగ్లండ్ సీనియర్ జట్టుతో తపడుతుంది.  మ్యాచ్ లు వరుసగా నవంబర్ 29, డిసెంబర్ 1, డిసెంబర్ 3వ తేదీలలో మధ్యాహ్నం 1:30 నుండి వాంఖడే స్టేడియంలో జరుగుతాయి. ఇక అభిమానులు టికెట్ల కోసం గంటలు, గంటలు క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా, టికెట్ల కోసంము పరిగెత్తకుండా ఫ్రీగా మ్యాచ్ చూసే అవకాశం ముంబై క్రికెట్ అసోసియేషన్ కలిపించింది. మహిళా క్రికెట్ ను ఆదరణ కల్పించే రీతిలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.  

Also Read :- క్రికెట్ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్..ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు స్టేడియంలో ఫ్రీగా చూసే అవకాశం