
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అరవై ఏండ్లకుపైగా కీలక పాత్ర పోషించిన మిగ్ 21 యుద్ధ విమానాలు రిటైర్ కానున్నాయి. 23 స్క్వాడ్రన్‌కు చెందిన చివరి ఆరు మిగ్21 జెట్లను శుక్రవారం పర్మనెంట్‌గా తొలగించనున్నారు. చండీగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో వీటికి వీడ్కోలు పరేడ్ జరగనుంది. వాయుసేన చీఫ్ ఎపీ సింగ్ స్వయంగా బదల్–3 కోడ్‌నేమ్‌తో ఉన్న చివరి మిగ్ 21ను నడపనున్నారు. ఇందులో స్క్వాడ్రన్ లీడర్ ప్రియా శర్మ పాల్గొననున్నారు. వేడుకకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్, సీడీఎస్క జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు హాజరుకానున్నారు.