రిటైర్డ్​ అధికారికి వీడ్కోలు

రిటైర్డ్​ అధికారికి వీడ్కోలు

సిద్దిపేట రూరల్, వెలుగు:   ఎవరికైనా రిటైర్మెంట్​ అనివార్యమని  అడిషనల్ కలెక్టర్లు గరీమ అగ్రవాల్, శ్రీనివాస్ రెడ్డి  అన్నారు. బుధవారం జిల్లా సంక్షేమ అధికారిగా పదవి విరమణ పొందిన  కే.సావిత్రిని కలెక్టర్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించి సన్మానించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు వచ్చి,   ఆమెను శాలువాతో  సన్మానించారు.    సావిత్రి జిల్లాలో 2 నెలలు మాత్రమే పనిచేసినా  నిబద్ధతతో  పని చేసి అందరి మన్ననలు పొందారని అన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు డీఆర్డీవో జయదేవ్, సరోజ, దేవకీదేవి, కవిత, రవికుమార్, ల్యాండ్ సర్వే వినయ్, మార్కెటింగ్ నాగరాజు, హరీష్ తదితరులు  పాల్గొన్నారు