రిపబ్లిక్‌ డే పరేడ్ తర్వాత విరాట్‌ రిటైర్‌‌మెంట్

రిపబ్లిక్‌ డే పరేడ్ తర్వాత విరాట్‌ రిటైర్‌‌మెంట్

రిపబ్లిక్‌ డే పరేడ్ తర్వాత ఒక స్పెషల్ గుర్రానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దగ్గరుండి వీడ్కోలు చెప్పారు. తన సేవల నుంచి ఆ గుర్రం ఇవాళే రిటైర్ అయింది. ఆ గుర్రం ప్రత్యేక ఏంటా అనుకుంటున్నారా? రాష్ట్రపతి బాడీగార్డ్‌ కమాండెంట్‌లో ఉండే గుర్రం అది. దాని పేరు విరాట్. రాష్ట్రపతి బాడీగార్డ్ కమాండెంట్ కల్నల్ అనూప్ తివారీ ఈ గుర్రాన్ని వాడుతున్నారు. గడిచిన 13 సంవత్సరాలుగా రిపబ్లిక్ డే పరేడ్‌లో ఇలా పాల్గొంటూ వస్తున్నారు.

ఈ గుర్రం ప్రత్యేక దేనికీ లేదు

రాష్ట్రపతి బాడీ గార్డ్స్‌ కమాండెంట్‌ గుర్రాల్లో దేనికీ కూడా ‘విరాట్‌’కు ఉన్న ప్రత్యేకత లేదు.  ఆర్మీ స్టాఫ్ కమాండేషన్ అవార్డును పొందిన గుర్రం ఇది. ఈ ఏడాది జనవరి 15న జరిగిన ఆర్మీ డే కార్యక్రమంలో ఈ అవార్డును విరాట్‌కు బహూకరించారు. ఆర్మీ స్టాఫ్ కమాండేషన్ అవార్డును అందుకున్న తొలి గుర్రం ఇదే కావడం విశేషం. విశిష్ఠమైన సేవలు అందించి, ప్రత్యేక సామర్థ్యాల కలిగిన గుర్రాలకు మాత్రమే ఈ అవార్డును ఇస్తారు. ఇంతటి  ప్రత్యేకత కలిగిన గుర్రం కాబట్టే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ వంటి వారు దానికి దగ్గరుండి వీడ్కోలు చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

పాక్ సరిహద్దులో ఒళ్లు గగుర్పొడిచేలా భారత సైనికుల పరేడ్

ప్లాస్టిక్ వస్తువులపై ఒమిక్రాన్ లైఫ్ 8 రోజులు

ఎన్టీఆర్‌ పేరు‌తో జిల్లా.. స్పందించిన ఆయన బిడ్డ