Faria Abdullah: ప్రేమలో పడ్డ జాతిరత్నాలు బ్యూటీ.. ఆ మిస్టరీ మ్యాన్ ఎవరో చెప్పేసిన చిట్టి!

Faria Abdullah: ప్రేమలో పడ్డ జాతిరత్నాలు బ్యూటీ.. ఆ మిస్టరీ మ్యాన్ ఎవరో చెప్పేసిన చిట్టి!

'జాతిరత్నాలు' సినిమాతో చిట్టీగా ఫేమస్ అయిపోయిన తెలుగు బ్యూటీ ఫరియా అబ్దుల్లా.  ఇటీవల 'గుర్రంపాపిరెడ్డి' మూవీతో పాటు 'అనగనగా ఒక రాజు' చిత్రాల్లో మెరిసింది. కెరీర్ ప్రారంభ లో ఆమెను చూసిన వారందరూ కూడా ఉత్తరాది అమ్మాయి అనుకున్నారు. కానీ, ఆమె అచ్చమైన హైదరాబాదీ పుట్టింది. పెరిగిండీ ఇక్కడే,  క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారును మాయ చేసిన అమ్మడు.. తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి చేసిన ఒక ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 ప్రేమలో ఉన్నారా.. 

సాధారణంగా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచుతారు. కానీ ఫరియా మాత్రం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఏమాత్రం తడబడకుండా, చాలా నిజాయితీగా సమాధానమిచ్చింది. మీరు ప్రేమలో ఉన్నారా?" అని యాంకర్ అడగ్గా.. కాసేపు సిగ్గుతో మురిసిపోయిన ఫరియా, అవును అని ఒప్పుకుంది. ఫరియా అబ్దుల్లా ప్రేమలో పడిందనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది

 ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు?

ఈ సందర్భంగా తన ప్రియుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. అతను డ్యాన్స్ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చాడని వెల్లడించింది. అతను ముస్లిం కాదని, హిందూ అని స్పష్టం చేసింది.  ప్రేమలో ఉండటం వల్ల తన జీవితం చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉందని, తన బిజీ షూటింగ్ షెడ్యూల్స్ మధ్య ఆ ప్రేమ ఒక మధురమైన అనుభూతిని ఇస్తుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నెటిజన్లు ఫరియా ప్రియుడు ఎవరై ఉంటారా? అని ఆరా తీస్తున్నారు. తామిద్దరం కలిసి వర్క్ చేస్తూ ఒక టీమ్ ముందుకు వెళ్తున్నట్లు మాట్లాడింది. కొంత కాలంగా తనలోని డ్యాన్స్, ర్యాప్ లో వచ్చిన మార్పులకు అతనే కారణమని ఫరియా గుర్తుచేసుకుంది. తమ మధ్య ఉండే బంధం లవ్ అఫైర్ కాదని ఆదొక అనుబంధం అంటోందీ అమ్మడు. ఇంతకూ పెళ్లెప్పుడు చేసుకుంటుందో మరి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

వరుస సినిమా ఆఫర్స్ తో.. 

ప్రస్తుతం ఫరియా చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో 'గుర్రం పాపిరెడ్డి' అనే చిత్రంతో పాటు, తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. సత్యరాజ్, విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'వల్లి మయిల్' సినిమాతో కోలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. సహజమైన నటన, అద్భుతమైన ఎనర్జీ కలిగిన ఫరియా అబ్దుల్లా, అటు కెరీర్ పరంగానూ, ఇటు పర్సనల్ లైఫ్ పరంగానూ కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టబోతోందని అర్థమవుతోంది. త్వరలోనే ఆ 'మిస్టరీ మ్యాన్' ఫోటోను కూడా ఫరియా రివీల్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

►ALSO READ | Dhurandhar OTT Release: ఓటీటీలోకి రణ్‌వీర్ సింగ్ 'దురంధర్'.. అదిత్యథర్ మూవీ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?