ఫాం హౌస్ కేసు : నిందితుల రిమాండ్ పొడగింపు

ఫాం హౌస్ కేసు : నిందితుల రిమాండ్ పొడగింపు

ఫాం హౌస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితుల  జ్యూడీషియల్ రిమాండ్ను ఏసీబీ కోర్టు పొడగించింది. రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీల రిమాండ్ గడువు ముగియడంతో పోలీసులు ఇవాళ వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు వారి జ్యూడీషియల్ రిమాండ్ను డిసెంబర్ 9వ తేదీ వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ ముగ్గురిని చంచల్ గూడా జైలుకు తరలించారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేశారన్న కేసులో ముగ్గురు నిందితుల కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ స్పెషల్ కోర్టు గురువారం కొట్టివేసింది. ముగ్గురు నిందితులను ఇప్పటికే రెండురోజుల కస్టడీకి అనుమతించామని, మరోసారి కుదరదని సిట్ అధికారులకు తేల్చి చెప్పింది. గతంలో నవంబర్ 10, 11, తేదీల్లో ముగ్గురి నిందితులను కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు పలు అంశాలపై ప్రశ్నించారు. కొంత సమాచారాన్ని రాబట్టారు. అయితే, దర్యాప్తులో భాగంగా కొన్ని ముఖ్య విషయాలు వెల్లడయ్యాయని వాటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు మరో ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టును కోరారు.