గుడ్డేలుగు వేషం.. కోతులు మాయం

గుడ్డేలుగు వేషం.. కోతులు మాయం

సిద్ధిపేట: ఆరుగాలం కష్టపడి పండించిన పంట కోతులపాలవుతోంది. ఏం చేయాలో అర్ధం కావడంలేదు. ఎంత ఆలోచించిన కోతుల సమస్యకి సొల్యూషన్ దొరకటంలేదు. ఇది ప్రస్తుతం కోతుల వల్ల రైతులు పడుతున్న బాధ. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నాగసముద్రాలకు చెందిన రైతు భాస్కర్ రెడ్డి అనే రైతుది ఇదే పరిస్థితి. కానీ ఈ రైతు కోతుల నుంచి పంటను కాపాడుకోవడనానికి వినూత్నంగా ఆలోచించాడు. గుడ్డేలుగును చూస్తే కోతులకు భయమని గతంలో ఎవరో చెప్పగా విన్నాడు. వెంటనే పట్నం వెళ్లి రూ. 10 వేలు పెట్టి గుడ్డేలుగు బొమ్మ కొన్నాడు. ఓ కూలీకి ఎలుగుబంటి వేశం వేయించి కాపలా ఉంచుతున్నాడు. దీంతో కోతులు, అడవి పందుల బాధ తప్పిందని రైతు భాస్కర్ రెడ్డి చెబుతున్నాడు. ఉపాయం ఉంటే ఎంతటి అపాయన్నైనా తప్పించుకోవచ్చని ఈ రైతు రుజువు చేశాడు. పంట రక్షణ కోసం వినూత్నంగా ఆలోచించిన భాస్కర్ రెడ్డిని తోటి రైతులు అభినందిస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం..

ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల

మొగిలయ్యకు వివేక్ వెంకటస్వామి ఆర్థిక సాయం