ఎంసెట్ షెడ్యూల్ రిలీజ్

ఎంసెట్ షెడ్యూల్ రిలీజ్

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్, ఈ సెట్ షెడ్యూల్ ను విడుదల చేసింది. మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్, ఈ సెట్ షెడ్యూల్స్ ప్రకటించారు. జూలై 14, 15, 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. అందులో భాగంగా జూలై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్ విభాగం, జూలై 18, 19, 20 తేదీల్లో ఇంజనీరింగ్ విభాగం వారికి వేరు వేరుగా పరీక్ష నిర్వహిస్తారు. జూలై 13న ఈ సెట్ ను నిర్వహించనున్నట్లు మంత్రి సబిత తెలిపారు. మొత్తం 23 రీజనల్ సెంటర్స్ పరిధిలో 105 పరీక్ష కేంద్రాల్లో ఎంసెట్, ఈ సెట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

టార్గెట్ 2027: ఎమ్మెల్యేగా గెలుపు.. ఎంపీ పదవికి రాజీనామా

నేను ముత్యాల ముగ్గు హీరోయిన్.. రేవంత్ రెడ్డి విలన్