మొగిలయ్యకు వివేక్ సన్మానం

మొగిలయ్యకు వివేక్ సన్మానం

న్యూఢిల్లీ: పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగిలయ్యను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి సన్మానించారు. అనంతరం వెంకటస్వామి ఫౌండేషన్ నుంచి లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... కఠిక పేదరికం నుంచి వచ్చిన మొగిలయ్య తన పాటతో అందరి మనసులను గెలుచుకున్నారన్నారు. ఆయన ప్రతిభకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసిందన్నారు. గతంలో ధనిక వర్గాల వారికే అవార్డులు దక్కేవని, కానీ మోడీ సర్కార్ లో నిరుపేదలకు అవార్డులు వస్తున్నాయని చెప్పారు. వివేక్ వెంకటస్వామితో పాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తల కోసం..

టార్గెట్ 2027: ఎమ్మెల్యేగా గెలుపు.. ఎంపీ పదవికి రాజీనామా

నేను ముత్యాల ముగ్గు హీరోయిన్.. రేవంత్ రెడ్డి విలన్