అప్పుల బాధతో  కౌలు రైతు ఆత్మహత్య

 అప్పుల బాధతో  కౌలు రైతు ఆత్మహత్య


ఏటూరునాగారం, వెలుగు: అప్పుల బాధతో ములుగు జిల్లాకు చెందిన కౌలు రైతు ఒకరు సూసైడ్ చేసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏటూరునాగారం మండల కేంద్రంలోని నాతకాని వాడకు చెందిన జాడి రామ్మూర్తి (36) నాలుగేండ్లుగా 9 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఇటీవలే ఫైనాన్స్​లో ట్రాక్టర్​తీసుకున్నాడు. ఏ యేటికాయేడు దిగుబడి రాకపోగా అప్పులు పెరిగిపోయాయి. ప్రస్తుతం పంట వేసేందుకు అప్పు దొరకలేదు. కొద్దిరోజులుగా భార్య సుగుణతో అప్పులు ఎలా తీర్చాలి అంటూ బాధపడుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్​రెడ్డి తెలిపారు.