పంటను కాపాడుకుందామని పోతే ప్రాణాలే పోయాయి

పంటను కాపాడుకుందామని పోతే ప్రాణాలే పోయాయి

సంగారెడ్డి: మనూర్ తండాలో విషాదం జరిగింది. చేతికొచ్చిన పంటను కాపాడుకుందామని పోతే ప్రాణాలే పోయాయి. నిన్న అర్ధరాత్రి హఠాత్తుగా వర్షం మొదలైంది. దీంతో చేనులో ఎండబెట్టిన జొన్నల కుప్పలు అకాల వర్షానికి తడిసి ఎక్కడ పాడవుతాయో అన్న భయంతో రాత్రే భార్యా భర్తలు కవర్లు పట్టుకుని చేనుకు వెళ్లారు. కుప్పలుగా పోసిన జొన్నల పై ప్లాస్టిక్ కవర్లు కప్పుతున్న టైంలోనే పిడుగుపడింది. పిడుగు పాటుకు గురైన భార్యా భర్తలిద్దరూ ఏం జరిగిందో గుర్తించేలోపే క్షణాల్లో ప్రాణాలు వదిలారు. పొలానికి వెళ్లిన తల్లిదండ్రులు ఎంతకూ రావడంతో వీరి ముగ్గురు పిల్లలు రోదిస్తుంటే గ్రామస్తులు వెళ్లి చూడగా శవాలు కనిపించాయి. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ముగ్గురు చిన్నారుల రోదనలు కంటతడిపెట్టించాయి.