మెదక్ టౌన్, వెలుగు: విద్యుత్ షాక్తో యువ రైతు చనిపోయిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ లింగం, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ మండలం గుట్టకిందిపల్లికి చెందిన అత్రెబోయిన చంద్రం(31) శుక్రవారం పొలంలో కరెంట్ స్టార్టర్వద్ద మరమ్మతులు చేసేందుకు వెళ్లాడు. విద్యుత్ సరఫరా అయ్యే ట్రాన్స్ఫార్మర్జంపర్కొట్టేందుకు వెళ్లగా విద్యుత్ షాక్కొట్టి స్పాట్ లో చనిపోయాడు. మృతుడి భార్య బాలమణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
