
వేములవాడరూరల్, వెలుగు : బావిలో నుంచి మోటార్‌ను బయటకు తీస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడి ఓ రైతు చనిపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లికి చెందిన మాసం రాజేశం, దేవయ్యకు చెందిన బావిలో నుంచి మోటార్ బయటకు తీసేందుకు అదే గ్రామానికి చెందిన తుపాకుల పర్శరాములు (68) వెళ్లాడు. మోటార్‌ను బయటకు తీస్తుండగా పర్శరాములు పట్టుతప్పి బావిలో పడి చనిపోయాడు.
స్థానికులు పర్శరాములు డెడ్‌బాడీని బావిలో నుండి బయటకు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య వెంకటవ్వ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మారుతి తెలిపారు.