
శ్రీకాకుళం : గ్రామ సభలో ఓ రైతు ఆత్మహత్యయత్నం చేయడం కలకలం రేపింది. ఈ సంఘటన బుధవారం ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. నరసన్నపేట మండలం దూకులపాడులో రైతు భరోసా కోసం గ్రామసభ నిర్వహించారు. సభలో పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ లు ఉన్నారు. అయితే తనకు రైతుభరోసా రాలేదని అందుకు కారణం పంచాయతీ కార్యదర్శే అంటూ కేకలు వేస్తూ జగన్మోహనరావు అనే వ్యక్తి పోట్రోల్ పోసుకున్నాడు.
ఆ తర్వాత కార్యదర్శిపై కూడా పెట్రోల్ పోశాడు. వెంటనే గ్రామస్థులు అతడిని పట్టుకుని నిప్పు అట్టించుకోకుండా చూశారు. దీంతో గ్రామంలో అలజడి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.