పరిహారం అందలేదని ఆత్మహత్య

పరిహారం అందలేదని ఆత్మహత్య

 లిస్ట్​లో తన కొడుకు పేరు లేదని పాలమూరు–రంగారెడ్డి నిర్వాసితుడి ఆత్మహత్య

పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్​ స్కీం ముంపు కింద తన కుటుంబానికి పరిహారం అందలేదని నాగర్​కర్నూల్ జిల్లా నార్లాపూర్​లోని సున్నపుతండాకు చెందిన బాలు నాయక్​(52) ఆత్మహత్య చేసుకున్నాడు. 
  
నాగర్​కర్నూల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నుంచి తన కుటుంబానికి రావాల్సిన పరిహారం అందలేదని పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్​ స్కీం ముంపు గ్రామం నార్లాపూర్​లోని సున్నపు తండాకు చెందిన బాలు నాయక్​(52) ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద కొడుకుతో కలిసి ఉన్న బాలు నాయక్ చిన్న కొడుక్కి పెండ్లి చేసి ఇల్లు కట్టించాడు. ముంపుకు గురయ్యే సున్నపుతాండాలోని ప్రతి ఇంటికీ ఆర్అండ్ఆర్ కింద రూ.12.50 లక్షలు చెల్సించాల్సి ఉంది. 77 గజాల ఇంటి స్థలం కేటాయించి రూ.5 లక్షలతో ఇల్లు కట్టించి ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ 50 ఇండ్ల ఉంటే అధికారులు 11 కుటుంబాలకు మాత్రమే పరిహారం చెల్లించారు. ఎంపిక చేసిన లబ్ధిదారుల లిస్టులో బాలు నాయక్​ కొడుకు చందు నాయక్ పేరు మొదట్లో ఉన్నప్పటికీ తర్వాత తొలగించారు. తన కొడుకుకు పరిహారం ఇప్పించాలంటూ ఎమ్మెల్యేను వేడుకున్నాడు. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగాడు. చివరికి పరిహారం రావట్లేదనే ఆవేదనతో బాలు నాయక్ బుధవారం రాత్రి ఉరేసుకొని ప్రాణం తీసుకున్నాడు. రిజర్వాయర్ ముంపు ప్రాంతాలైన అంజనగిరి, దూల్యానాయక్ తండా, సున్నపు తండా, వడ్డెగుడిసెలు, బోడబండ తండాలలో నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు కొల్లాపూర్​ రాజుకు చెందిన 10 ఎకరాలు, టన్నెళ్లకు దగ్గర్లో 33 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు. ఆ స్థలాన్ని కలెక్టర్ మనూ చౌదరి, అదనపు కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి గురువారం పరిశీలించారు.