రైతు సంక్షేమమే ప్రభుత్వధ్యేయం : ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం

రైతు సంక్షేమమే ప్రభుత్వధ్యేయం : ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం

వర్ని, వెలుగు: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, వారి సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తోందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌‌రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్‌‌ జిల్లా వర్ని మండలం జాకోర గ్రామంలో బుధవారం జాకోర లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో సాగునీరు అందని ప్రాంతాలకు కూడా నీటిని అందించి, ప్రతి ఎకరాను సాగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇరిగేషన్ పథకాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. 

బాన్సువాడ నియోజకవర్గంలో సుమారు 1.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పోచారం పేర్కొన్నారు. రాష్ట్ర ఆగ్రోస్​ చైర్మన్​ కాసుల బాల్‌‌రాజ్‌‌, పీసీసీ డెలిగేట్​కూనిపూర్​ రాజిరెడ్డి, లీడర్లు వెలగపూడి గోపాల్, తదితరులు పాల్గొన్నారు.