జగిత్యాల జిల్లా రాయికల్ లో రైతుల ఆందోళన

జగిత్యాల జిల్లా రాయికల్ లో రైతుల ఆందోళన

జగిత్యాల జిల్లా రాయికల్ లో రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్లపై వంటావార్పు చేస్తూ.. నిరసనకు దిగారు. పండించిన ధాన్యాన్ని రోడ్డుపై పోసి కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. ఆరుగాలం కష్టపడి పంచిన పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నదాతలు మండిపడ్డారు. వెంటనే పండించిన పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 

కొనుగోలు విషయంలో స్పష్టత వచ్చే వరకు నిరసనలు విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు. సంఘటన స్థలానికి  చేరుకున్న పోలీసులు ధర్నాను విరమించాలని కోరినా కర్షకులు రోడ్డుపై భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో రాస్తారోకోతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.