మొత్తం పేమెంట్​చేశాకే ట్రెంచ్​కొట్టాలి

మొత్తం పేమెంట్​చేశాకే ట్రెంచ్​కొట్టాలి

శాయంపేట, వెలుగు:  గ్రీన్​ఫీల్డ్​హైవేకు సంబంధించిన రోడ్డు పనులు జరగాలంటే ముందుగా గవర్నమెంట్​చెప్పిన రేట్​ప్రకారం తమ బ్యాంకు ఖాతాల్లో పైసలు పడ్డాకే పనులు మొదలు పెట్టాలని, అప్పటి వరకు ఆఫీసర్లు ట్రెంచ్​పనులు మొదలు పెట్టవద్దని రైతులు పనులను అడ్డుకున్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తిలో గ్రీన్​ఫీల్డ్​కు సంబంధించిన రోడ్డు పనులను శుక్రవారం అధికారులు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న రైతులు తమ పరిహారం డబ్బులు జమకాకుండా పనులు ఎలా మొదలు పెడతారని పనులను అడ్డుకున్నారు.

 పరకాల ఆర్డీవో నారాయణ, శాయంపేట సీఐ రంజిత్​రావు, ఎస్సైలు పరమేశ్‌, కొంక అశోక్ అక్కడికి చేరుకుని రైతులకు సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. పరిహారంలో చెల్లింపులో భాగంగా ఆర్డీవో నారాయణ చేతుల్లో ఉన్న అడ్వాన్స్​ను పేమెంట్​చేశామని,  మిగిలిన అమౌంట్​ను పూర్తి మొత్తం పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే మిగలిన రైతుల పేమెంట్​ సైతం సోమవారంలోగా వాళ్ల బ్యాంకు అకౌంట్​లో జమ అవుతాయని చెప్పారు. అనంతరం పనులు ప్రారంభించారు.