తాడూరులో ఘనంగా రైతు సంబరాలు : ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి

తాడూరులో ఘనంగా రైతు సంబరాలు  : ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి
  •     ఎడ్ల బండలాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : తాడూరు మండల కేంద్రంలో ఘనంగా రైతు సంబరాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం తాడూరులో ఎద్దుల బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు అని, వీటిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వ్యవసాయ రంగాభివృద్ధికి అనేక పథకాలను అమలు చేస్తోందని వెల్లడించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, సర్పంచ్ సంధ్యామల్లయ్య, రైతులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.