ట్రాక్టర్లలో ధాన్యంతో రైస్ మిల్లు ఎదుట రైతుల ఆందోళన

 ట్రాక్టర్లలో ధాన్యంతో రైస్ మిల్లు ఎదుట రైతుల ఆందోళన
  • రైతులు రాకను చూసి రైస్ మిల్లుకు తాళం
  • కరీంనగర్ జిల్లా శాయంపేటలో రైస్ మిల్లు ఎదుట రైతుల ఆందోళన

కరీంనగర్ జిల్లా శాయంపేట గ్రామం దగ్గరలోని ఓ రైస్ మిల్లు ముందు ఆందోళన చేశారు రైతులు. రైతులు ట్రాక్టర్లలో ధాన్యం తీసుకురావడాన్ని గమనించి మిల్లుకు తాళం వేశారు.  ట్రాక్టర్లలో తెచ్చిన ధాన్యాన్ని మిల్లులోపలికి తీసుకురాకుండా గేట్లకు తాళం వేసింది మిల్లు యజమాన్యం. దీంతో రోడ్డుపై ట్రాక్టర్లను అడ్డంపెట్టి నిరసన తెలిపారు రైతన్నలు. రైతుల ఆందోళన విషయం తెలుసుకుని మీడియా ప్రతినిధులు స్పాట్ కు చేరుకోవడంతో..గేట్లకు వేసిన తాళాలు తీశారంటున్నారు రైతులు. 
ధాన్యం తెచ్చాక..ఇలా మిల్లు మూసేస్తే ఎలా?
ఐకేపీ వాళ్లు కాటా వేసిన తర్వాత ధాన్యం మిల్లు దగ్గరకు తీసుకెళ్లమన్నారు. తెల్లవారుజామునే రైస్ మిల్లు దగ్గరకు వస్తే.. గేట్లు వేసేశారు. ఎంత అడిగినా పట్టించుకోవడం లేదు. కొంటామని చెప్పినందుకే కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని తీసుకుని ఐకేపీ వాళ్ల దగ్గరకు వెళ్లి కాటా వేయించి తీసుకొచ్చాం. తీరా ఇక్కడకు వచ్చాక మిల్లు మూసేసి మమ్మల్ని లోపలికి రానీయకుండా రోడ్డుపై  ఎండకు మాడిస్తే ఎలా..? అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంటామని చెప్పి ఇలా ఇబ్బందిపాలు చేయడం సరికాదన్నారు. 

 

 

ఇవి కూడా చదవండి

పెట్రో, గ్యాస్ ధరల పెంపుపై మహిళా నేతల నిరసన

ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ.. రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు

పోలీసులపై చిరుత దాడి