పాస్ పుస్తకాలు ఇవ్వాలని రైతుల వినతి

పాస్ పుస్తకాలు ఇవ్వాలని రైతుల వినతి

శివ్వంపేట, వెలుగు: మండలంలోని ఉసిరికపల్లి గ్రామంలో నిర్వహించిన  రెవెన్యూ సదస్సులో అనేక ఏళ్లుగా భూములు సాగు చేసుకుంటున్న తమకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని రైతులు డీటీ మహమ్మద్  షఫీఉద్దీన్ కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. 

 గ్రామంలో సర్వే నంబర్ 276 లోని కొండయ్య గారి కుంట భూములను 30 ఏళ్లుగా గ్రామానికి చెందిన 34 మంది రైతులు  సాగు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు.  ప్రభుత్వం దయతలచి తాము సాగు చేసుకుంటున్న భూములను రెగ్యులరైజ్ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరారు.