జోగిపేటలో జీలుగ విత్తనాల కోసం రైతులు పడిగాపులు

జోగిపేటలో జీలుగ విత్తనాల కోసం రైతులు పడిగాపులు

జోగిపేట, వెలుగు: జీలుగ విత్తనాల కోసం రైతులు జోగిపేట వ్యవసాయశాఖ కార్యాలయం ముందు క్యూ కట్టారు. సోమవారం ఉదయం 5 గంటల నుంచే పాస్​బుక్కులు పట్టుకొని లైన్​లో నిల్చున్నారు. అధికారులు ఆలస్యంగా రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మూడెకరాలు  గల రైతులకు ఒక జీలుగ బస్తా మాత్రమే ఇచ్చారు. 400 క్వింటాళ్ల  జీలుగ విత్తనాలు మాత్రమే వచ్చాయని వ్యవసాయాధికారి శ్రీహరి తెలిపారు. కొరత లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.