ఢిల్లీ సరిహద్దుల్లోనే రైతుల హోలీ వేడుకలు

ఢిల్లీ సరిహద్దుల్లోనే రైతుల హోలీ వేడుకలు

ఢిల్లీ సరిహద్దుల్లోనే హోలీ వేడుకలు జరుపుకున్నారు రైతులు. ప్రత్యేక వాయిద్యాల సంగీతానికి డ్యాన్స్ చేశారు. సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేవరకు ఇంటికి తిరిగిపోయేది లేదని స్పష్టం చేశారు రైతులు. కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు రైతులు. ఆదివారం కామదహనం సందర్భంగా సాగు చట్టాల ప్రతలను కాల్చివేశారు.కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన 300 మంది మహిళలు... ఊరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గుట్టకు వెళ్లేందుకు మెట్లు నిర్మిస్తున్నారు. ఇసుక కంకర సిమెంట్ ను గుట్టపైకి మోసుకెళ్లి మెట్ల నిర్మాణాన్ని పూర్తిచేస్తున్నారు. ఇప్పటివరకు 2వందల 12 మెట్లు పూర్తి కాగా.. ఇంకా 150 మెట్లు పూర్తి కావాల్సి ఉంది. కొన్నేళ్లుగా గుట్టపైకి వెళ్లేందుకు మెట్లు లేవని చెబుతున్నారు. ఎవరికి చెప్పినా పట్టించుకోకపోవడంతో తామే మెట్లు కడుతున్నామని చెప్పారు.