పట్టాలున్నాభూములు గుంజుకుంటరా?.కరెంట్ టవర్ ఎక్కిన రైతులు

పట్టాలున్నాభూములు గుంజుకుంటరా?.కరెంట్ టవర్ ఎక్కిన రైతులు

పట్టాలున్నా సాగు భూములు గుంజుకుంటున్నారని, రైతుబంధు ఇస్తలేరని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కస్తూరినగరంలో రైతులు హైటెన్షన్ కరెంట్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. 70 ఏళ్లుగా వ్యవసాయంపై బతుకుతున్నామని, 1,500 ఎకరాల్లో గత ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చాయన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం.. భూప్రక్షాళనలో తమ భూములను అటవీ ప్రాంతంగా నిర్ధారణ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామంలోని ప్రతి రైతుకు ఉన్న పట్టాను రద్దు చేసి, 2005 తర్వాత
సాగుచేసిన సుమారు 25 హెక్టార్ల భూమిని ఫారెస్ట్ ఆఫీసర్లు ట్రెంచ్ వేసి అందులో ప్లాం టేషన్ చేశారన్నారు.