రైతుల ఆవిష్కరణలకు పేటెంట్ అవసరం: హార్టికల్చర్ వర్సిటీ వీసీ

రైతుల ఆవిష్కరణలకు పేటెంట్ అవసరం:  హార్టికల్చర్ వర్సిటీ వీసీ

హైదరాబాద్, వెలుగు: రైతుల ఆవిష్కరణలను పేటెంట్ హక్కుతో రక్షించాలని కొండా లక్ష్మణ్ హార్టికల్చర్​ వర్సిటీ  వీసీ దండా రాజిరెడ్డి అన్నారు. రైతు, సంస్థల ఆధారిత ఆవిష్కరణలకు రక్షణ అవసరమని, నెలకు ఒక పేటెంట్ దాఖలు చేయాలని వర్సిటీ లక్ష్యం పెట్టుకుందన్నారు. 

శుక్రవారం (ఆగస్టు 01) హార్టికల్చర్​ వర్సిటీ, ఐపీఆర్ ఆధ్వర్యంలో ‘ఉద్యాన రంగంలో ఆవిష్కరణలు: పేటెంట్​ హక్కులు’ అనే జాతీయ వర్క్‌‌‌‌షాప్‌‌‌‌ను నిర్వహించారు. ఇందులో వీసీ మాట్లాడుతూ.. వర్సిటీ ఆధ్వర్యంలో బాలానగర్ సీతాఫలం, ఆర్మూర్ పసుపు భౌగోళిక గుర్తింపు (జీఐ) రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతున్నట్లు తెలిపారు. పరిశోధకులు, విద్యార్థుల పేటెంట్- యోగ్యమైన ఆవిష్కరణలకు వర్సిటీ ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.