రైతులు తగ్గేది లేదు..ఇదే సరైన సమయం

రైతులు తగ్గేది లేదు..ఇదే సరైన సమయం

రైతుల మధ్య ఎటువంటి విభేదాలు లేవన్నారు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిట్. ఢిల్లీ యూపీ సరిహద్దు ఘాజీపూర్ లో నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. బీకేయూ నేత భాను ప్రతాప్ సింగ్ కాంప్రమైజ్ కావాలంటూ.. ముగ్గురు నేతలు యూనియన్ కు రాజీనామా చేశారన్నారు. రైతులు తగ్గే అవసరమే లేదన్నారాయన. అటు టిక్రి బోర్డర్ లో రైతు సంఘాల నేతల నిరాహార దీక్ష కొనసాగుతోంది. తమ డిమాండ్లపై కేంద్రం మొండి పట్టుదలకు పోతోందన్నారు. కేంద్రాన్ని తట్టిలేపేందుకు ఇదే సరైన సమయమని ఆలిండియా కిసాన్ సభ వర్కింగ్ ప్రెసిడెంట్ బాల్ కరణ్ సింగ్ అన్నారు.

ఇవాళ ఉదయం 8 గంటలకు మొదలైన నిరాహార దీక్షలు.. సాయంత్రం ఐదింటి వరకు కొనసాగనున్నాయి. ఢిల్లీలోని సరిహద్దు ప్రాంతాల్లో ఈ దీక్షలు కొనసాగుతున్నాయి. యునైటెడ్ ఫార్మర్స్ ఫ్రంట్ తరఫున 40 మంది రైతు సంఘాల నేతల హంగర్ స్ట్రైక్ లో పాల్గొంటున్నారు. ఢిల్లీ-హరియానా బోర్డర్ సింఘు దగ్గర 25 మంది… టిక్రి బోర్డర్ లో 10 మంది… యూపీ బోర్డర్ ఐదుగురు దీక్షలో కూర్చుంటారని తెలిపారు భారతీయ కిసాన్ యూనియన్ పంజాబ్ నేత హరిందర్ సింగ్ లోఖోవాల్. కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలను రద్దుచేసేవరకు తమ పోరాటం ఆగదన్నారు.