తుమ్మల పార్టీ మార్పుపై క్లారిటీ.. డేట్ ఫిక్స్?

తుమ్మల పార్టీ మార్పుపై క్లారిటీ.. డేట్ ఫిక్స్?

ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌కి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుడుగలపల్లి గ్రామంలోని తుమ్మల నాగేశ్వరరావు ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. తుమ్మల నాగేశ్వరరావును కలవడానికి నియోజకవర్గంలోని రైతులు, ఆయన అనుచరులు భారీగా తరలివచ్చారు. తుమ్మలను పార్టీ మారాలని ఒత్తిడి తెస్తున్నారు. అంతేకాకుండా తుమ్మలను పాలేరు నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పాలేరును విడిచి వెళ్లొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. పాలేరు అభివృద్ధి తుమ్మలతోనే సాధ్యం అవుతుందని రైతులు, ఆయన అభిమానులు అనుకుంటున్నారు. ఎవరు పోటీ చేసినా..పాలేరులో తుమ్మల గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Also Read ; ప్రధాని మోదీ ఎస్​పీజీ డైరెక్టర్​ మృతి

మరోవైపు పార్టీ మార్పు అంశంపై ముఖ్య నాయకులు, కార్యకర్తలతో తుమ్మల నాగేశ్వరరావు భేటీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంపై అనుచరులు, ముఖ్యనాయకుల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే తుమ్మల పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా  సెప్టెంబర్ 17న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది. ఈ మేరకు ప్రచారం జరుగుతోంది. తుమ్మల పార్టీ మార్పు అంశం ఖమ్మంలో హాట్ టాఫిక్ గా మారింది.