జూన్ 9, 10న రైతు సమస్యలపై సదస్సు.. విజయవంతం చేయాలని విమలక్క పిలుపు

జూన్ 9, 10న రైతు సమస్యలపై సదస్సు..    విజయవంతం చేయాలని విమలక్క పిలుపు

పంజాగుట్ట, వెలుగు: నగరంలో రైతాంగ సమస్యలపై జరగనున్న రెండు రోజుల సదస్సును విజయవంతం చేయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క కోరారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో రైతు సంఘం నాయకులతో కలిసి ఈ సదస్సు వాల్ పోస్టర్​ను ఆవిష్కరించారు. 

జూన్ 9, 10 తేదీల్లో  కాచిగూడ తుజ్జాభవన్ వేదికగా ఈ సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు, రైతు కూలీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ సదస్సును విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పట్లోళ్ల నాగిరెడ్డి, కార్యదర్శి వెలుతురు సదానందం, నాయకులు యుగేందర్, వెంకటేశ్వర్ రావు, బోనాల స్వామి తదితరులు పాల్గొన్నారు.