రేవల్లి/ఏదుల, వెలుగు: గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్‌ను నిర్మించొద్దని గొల్లపల్లి, చీర్కపల్లి, చెన్నారం గ్రామాల రైతులు డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ వారు తెలుపుతున్న శాంతియుత నిరసనలు ఆదివారం 27వ రోజుకు చేరాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదంటూ రోడ్డెక్కారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో వారు రోడ్డుపై బైఠాయించి, ధర్నా చేపట్టారు. నాగర్ కర్నూల్ ప్రాంతంలో భూముల ధరలు తక్కువగా ఉండటంతో కమీషన్ల కోసమే కొత్త రిజర్వాయర్లను ప్రతిపాదిస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టును అడ్డుకుంటామని పేర్కొన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన అఖిల పక్ష పోరాట సమితి నాయకులు దొడ్ల రాములు, మధుగాని రమేశ్‌తోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు రేవల్లి ఎస్సై రజిత తెలిపారు.
