రంగంపేటలో వడ్లు కాంట పెడ్తలేరని రైతుల ఆందోళన

 రంగంపేటలో వడ్లు కాంట పెడ్తలేరని రైతుల ఆందోళన

కొల్చారం, వెలుగు: వడ్లు కాంట పెడ్తలేరని రైతులు రాస్తారోకో చేపట్టారు. పైతర గ్రామానికి చెందిన రైతులు రంగంపేటలోని ప్రధాన రహదారిపై ముళ్ల కంచెలు వేసి నిరసన తెలిపారు. వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీలు, లారీల కొరతను తీర్చి తొందరగా తూకం వేసి రైస్ మిల్లులకు రవాణా చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మహ్మద్ గౌస్, తహసీల్దార్ శ్రీనివాస్ చారి ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.