రాజేంద్రనగర్ లోని ఐసీఏఆర్ ముందు రైతుల ఆందోళన

రాజేంద్రనగర్ లోని ఐసీఏఆర్ ముందు రైతుల ఆందోళన
  • విత్తనాల విక్రయం రద్దు చేయడంతో నిరసన

గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్ లోని ఐసీఏఆర్ ముందు మంగళవారం రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మంగళవారం నుంచి నిర్వహించాల్సిన విత్తన మేళా–2025, డీఆర్ఆర్ దాస్–75 విత్తనాల అమ్మకాన్ని అధికారులు సడెన్ గా రద్దు చేశారు. ఈ విషయం తెలియక మంగళవారం పెద్ద ఎత్తున రైతులు అక్కడకు చేరుకున్నారు.

అధికారులు మాత్రం విత్తనాలు అందుబాటులో లేవని బోర్డు ఏర్పాటు చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐసీఏఆర్ అధికారుల తీరుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. సమాచారం అందుకున్న  పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. రైతులను సముదాయించి అధికారులతో మాట్లాడి ప్రతిరైతుకు 2కేజీల వరి బ్యాగ్ విత్తనాలను ఇచ్చి పంపించేశారు.