బోయినిపల్లి, గంగాధర, వెలుగు: కాళేశ్వరం అడిషనల్ టీఎంసీ భూసేకరణ కోసం సర్వేకు వస్తే బడితె పూజ తప్పదంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి, కరీంనగర్ జిల్లా గంగాధర మండలాల్లోని రైతులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైతులు తమ పొలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ తమకు తెలియకుండా రావద్దని వార్నింగ్ ఇస్తున్నారు. ‘నా అనుమతి లేకుండా నా పొలంలో భూసేకరణకు ఏ అధికారి గాని, ఏ సర్వేయర్గాని ప్రవేశించినట్లయితే కేసీఆర్దొరగారు చెప్పినట్టు బడితె పట్టి జోపుడు కార్యక్రమం జరుపబడును’ అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.
