ఇథానల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని వంటావార్పు .. రైతుల పోరాటానికి సీపీఎం మద్దతు

ఇథానల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని వంటావార్పు .. రైతుల పోరాటానికి సీపీఎం మద్దతు

నర్సాపూర్ (జి) వెలుగు: ఇథనాల్​ఫ్యాక్టరీని రద్దు చేయాలని డిమాండ్​చేస్తూ రైతుల నిరసన కొనసాగుతోంది. వారికి సీపీఎం నేతలు మద్దతు ప్రకటించారు. నిర్మల్ జిల్లా దిలావల్ పూర్ మండల సరిహద్దుల్లోని ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్యం కారణంగా తాము తీవ్రంగా నష్టపోతామని పేర్కొంటూ రైతులు కొద్దికాలంగా నిరసన తెలుపుతున్నారు. దిలావల్ పూర్ గ్రామస్తులంతా గురువారం స్వచ్ఛందంగా దుకాణాలకు బంద్ పాటించి వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.

వారికి సీపీఎం నేతలు మద్దతు తెలిపారు. ఫ్యాక్టరీని రద్దు చేయాలని సీపీఎం జిల్లా  కార్యదర్శి దుర్గం నూతన ప్రసాద్ కాంగ్రెస్​ప్రభుత్వాన్ని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించి ఫ్యాక్టరీని రద్దు చేసేంతవరకు రైతాంగంతో కలిసికట్టుగా పోరాడాలని  ప్రజా సంఘాలు, గ్రామస్తులు కోరారు.

ఈ సమస్య గత పాలకుల పాపమే..

నిర్మల్: దిలావర్ పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ సమస్యకు గత పాలకుల పాపమే కారణమని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఓ ప్రకటనలో ఆరోపించారు. అనాలోచితంగా గత బీఆర్​ఎస్ ప్రభుత్వం, అప్పటి పాలకులు పూర్తి స్థాయిలో అనుమతులు ఇచ్చారన్నారు.ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని, రైతులంతా సంయమనం పాటిం చాలని కోరారు. సీఎంతో పాటు సంబంధిత శాఖ మంత్రి, అధికారులను కలిసి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామన్నారు. ఇప్పటికే ఈ విషయంపై జిల్లా అధికారులతో మాట్లాడినట్లు చెప్పారు.