మహబూబాబాద్, వెలుగు: మున్నేరు నదీ పరివాహక ప్రాంతం ఎంతో సారవంతమైన భూములకు నీరు అందకుండా పాలేరుకు లింక్ కెనాల్ ద్వారా నీటిని మళ్లించడం వల్ల ఇక్కడి ఆయకట్టు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం గార్ల మండల కేంద్రంలో నిరసన తెలిపారు.
లింక్ కెనాల్ ను వ్యతిరేకిస్తూ డిజిటల్ సర్వే ద్వారా ప్రజలు మెజార్టీ ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేసినందున ప్రభుత్వం ఈ లింక్ కెనాల్ ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శీలం శెట్టి రమేశ్, రైతులుతదితరులు పాల్గొన్నారు.
