రైతుల ఆందోళన.. రోజుకు రూ. 3500కోట్ల నష్టం

రైతుల ఆందోళన.. రోజుకు రూ. 3500కోట్ల నష్టం

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత15  రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. పంజాబ్,హరియానా,హిమాచల్ ప్రదేశ్,జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల రైతులు ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. రైతుల ఆందోళన దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని వాణిజ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి.  ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన వల్ల రోజుకు రూ.3500 కోట్ల నష్టం వాటిల్లుతుందని అసోచామ్ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం, రైతులు త్వరగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది.

రైతుల ఆందోళనల వల్ల పంజాబ్,హరియాణా,హిమాచల్ ప్రదేశ్,జమ్మూకశ్మీర్  రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ మొత్తం రూ.18 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా.. వ్యవసాయం, ఫుట్ ప్రాసెస్, జౌళి, ఉద్యానవనం,ఆటోమొబైల్ ఇండస్ట్రీలపై ఆధారపడి ఉంటుంది. అయితే రైతులు ఆందోళనలతో రోడ్లు మూసివేయడంతో ఈ రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. పరిశ్రమలు తమ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయలేకపోతున్నాయి.దీంతో రోజుకు 3000-3500 కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందని అసోచామ్ అంచనా వేసింది. రైతులు ఇలాగే ఆందోళనలు కొనసాగిస్తే  నాలుగు రాష్ట్రాల ఆదాయమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) హెచ్చరించింది.