ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలి.. కోదాడ, -ఖమ్మం రహదారిపై రైతుల ధర్నా

ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలి.. కోదాడ, -ఖమ్మం రహదారిపై రైతుల ధర్నా

కోదాడ, వెలుగు:  సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మర వద్ద శనివారం అఖిలపక్ష పార్టీలు, రైతు సంఘాల నాయకులు, రైతులు ధర్నా నిర్వహించారు. ఐకేపీ సెంటర్లకు ధాన్యం తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తోందని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు మండిపడ్డారు. ఇదే అదునుగా దళారులు, మిల్లర్లు కుమ్మక్కై తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆందోళనలను ఉధృతం  చేస్తామని హెచ్చరించారు.