
వీపనగండ్ల, వెలుగు: తాలు ఉందని చెప్పి వీపనగండ్ల ఐకేపీ సెంటర్‌లో నెలరోజులుగా వడ్లు కొంటలేరని ఆరోపిస్తూ రైతులు బస్టాండ్ చౌరస్తాలో మంగళవారం సాయంత్రం రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో పోసి వడ్లు పోసి నెలవుతున్నా కొనడం లేదని ఆరోపించారు. మరోవైపు కొన్న వడ్లలో తాలు ఉంటుండడంతో మిల్లర్లు దించుకోవడం లేదని, 40 కేజీలకు 3, 4 కేజీలు తరుగు తీస్తేనే దించుకుంటున్నామని చెబుతున్నట్లు నిర్వాహకులు చెప్పడం గమనార్హం.
రైతుల ఆందోళనతో అక్కడికి చేరుకున్న తహసీల్దార్ వరలక్ష్మి, ఏఎస్ఐ చంద్రారెడ్డి వారితో మాట్లాడి సమస్యను ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్లి పరిష్కరించేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.