
యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం పీఏసీఎస్‌ల ఎదుట బారులు తీరుతున్నారు. నిర్మల్‌జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలోని పీఏసీఎస్‌కు గురువారం యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు ఉదయం 6 గంటల నుంచే ఆఫీసు ముందు క్యూ కట్టారు. గంటలకొద్ది నిలబడలేక చెప్పులను లైన్లో పెట్టారు. 450 బ్యాగుల యూరియా రాగా బయోమెట్రిక్ ద్వారా ఒక్కో రైతుకు మూడు సంచుల చొప్పున పంపిణీ చేశారు. చాలామంది యూరియా దొరకక నిరాశకు గురయ్యారు. - లోకేశ్వరం, వెలుగు