
తాడ్వాయి, వెలుగు : మండలంలోని తాడ్వాయి, కృష్ణాజివాడి గ్రామంలో యూరియా కోసం రైతులు బారులుదీరారు. పోలీస్ పహారా మధ్య సొసైటీ అధికారులు యూరియా పంపిణీ చేశారు. రెండు సొసైటీలు, ఆరు సబ్ సెంటర్ల పరిధిలో సరిపడా యూరియా ఉందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాడ్వాయి ఏవో నర్సింహులు తెలిపారు.
మండలానికి 2134 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా ఇప్పటివరకు 1258 టన్నుల యూరియా పంపిణీ చేశామని తెలిపారు.