మెట్‌‌‌‌‌‌‌‌పల్లిలోని గోదాంల వద్దకు .. యూరియా కోసం క్యూ కట్టిన రైతులు

మెట్‌‌‌‌‌‌‌‌పల్లిలోని గోదాంల వద్దకు .. యూరియా కోసం క్యూ కట్టిన  రైతులు

శంకరపట్నం, వెలుగు : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌‌‌‌‌‌‌‌పల్లి సహకార సంఘం ఆధ్వర్యంలోని  గోదాంల వద్ద మంగళవారం యూరియా కోసం రైతులు క్యూ కట్టారు. సోమవారం రాత్రి యూరియా బస్తాలు రాగా.. వేకువజాము నుంచే  రైతులు చేరుకొని చెప్పులు క్యూలో ఉంచారు. 

దీంతోపాటు కన్నాపూర్ , లింగాపూర్ గోదాంల వద్ద రైతులు క్యూ కట్టారు. ఒక్కో రైతుకు 2 బస్తాలు చొప్పున పంపిణీ చేశారు.