ఆర్గానిక్ పసుపు సాగుపై రైతులు దృష్టి పెట్టాలె

ఆర్గానిక్ పసుపు సాగుపై రైతులు దృష్టి పెట్టాలె

ఆర్గానిక్ పసుపు సాగుపై రైతులు దృష్టి పెట్టాలన్నారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్. స్పైస్ బోర్డు ద్వారా పసుపు అమ్మకాలకు, ఎగుమతులకు రైతులకు పూర్తి సహకారం అందుతుందన్నారు. నిజామాబాద్ జిల్లా లక్కోరాలో.. స్పైస్ బోర్డ్, రైల్వే అధికారులు, రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు అర్వింద్. పసుపు సాగు మొదలు నుంచి కొనుగోలు వరకు కేంద్రం రైతులకు రాయితీలు ఇస్తుందన్నారు. ఈసారి వర్షాలతో పసుపు రైతులు నష్టపోయారన్నారు.  మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కిం కింద పంట కొనుగోళ్లు జరుపుతామన్నారు.