పాలు అమ్మి.. అప్పులు చేసి చదివించిన తండ్రి.. స్టేట్ ర్యాంక్ కొట్టిన కొడుకు

పాలు అమ్మి.. అప్పులు చేసి చదివించిన తండ్రి.. స్టేట్ ర్యాంక్ కొట్టిన కొడుకు

తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. రెండు విభాగాల్లోనూ టాప్‌ ర్యాంకులు దక్కించుకున్నారు. మొత్తంగా ఇంజనీరింగ్‌ విభాగంలో 80 శాతం, అగ్రికల్చర్‌, మెడికల్‌ విభాగంలో 86 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.  

రైతు కుమారుడికి ఫస్ట్ ర్యాంక్ 

TS EAMCET 2023లో AM స్ట్రీమ్‌లో  ఆంధ్రప్రదేశ్ కు చెందిన రైతు కొడుకు అగ్రస్థానంలో నిలిచాడు.  తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జస్వంత్ 160 మార్కులకు 155 సాధించాడు. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) UG 2023కి హాజరైన జస్వంత్ డాక్టర్ కావాలనుకుంటున్నాని తెలిపాడు.

కార్డియాలజిస్ట్‌ కావాలన్నదే లక్ష్యం

నీట్‌ను ఛేదిస్తానని నాకు నమ్మకం ఉందని బస్వంత్ అన్నాడు. తాను కార్డియాలజిస్ట్ కావాలనుకుంటున్నానన్నాడు.   ఆర్థికంగా బలహీనంగా ఉన్నందున, నా చదువు కోసం మా తల్లిదండ్రులు అప్పులు చేయాల్సి వచ్చింది. తన మామ కూడా నాకు ఆర్థికంగా సాయం చేస్తానని జస్వంత్ తెలిపారు. తెలంగాణ ఎంసెట్‌ మెడికల్‌ విభాగంలో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించడం చాలా ఆనందంగా వుంది. వైద్య విద్యను అభ్యసించి కార్డియాలజిస్ట్‌ కావాలనేది నా లక్ష్యం. రోజూ ఉదయం 6నుంచి రాత్రి 9గంటల వరకు చదువుకోవడం, బలహీనంగా ఉన్న సబ్జెక్టులపై ఎక్కువ దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకోవడం ద్వారా ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించానని  - బురుగుపల్లి సత్యరాజ్‌ జశ్వంత్‌, అగ్రికల్చర్‌, మెడికల్‌లో 1వ ర్యాంకర్‌ తెలిపారు. 

పాలు అమ్మి నాకుమారుడిని చదివించా..

కౌలు రైతు అయిన జస్వంత్ తండ్రి బూరుగుపల్లి సాయి రామకృష్ణ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్రంగా నష్టపోయాడు. జిల్లాలో వరదల కారణంగా రూ.6 లక్షల నష్టం వాటిల్లింది.ప్రస్తుతం  పాలు అమ్మి జీవనం కొనసాగిస్తూ.. తన కుమారుడిని చదివించానని  బస్వంత్ తండ్రి రామకృష్ణ తెలిపారు.