వానాకాలం సాగు పెట్టుబడిపై అన్నదాతల ఆందోళన

వానాకాలం సాగు పెట్టుబడిపై అన్నదాతల ఆందోళన
  • రుణమాఫీ చేయక.. లోన్లు ఇయ్యనంటున్న బ్యాంకులు
  • బయట కూడా ఎవరూ అప్పు పుట్టనిస్తలే
  • వానాకాలం సాగు పెట్టుబడి కోసం రైతుల ఆందోళన

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: వానకాలం సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గర పడుతోంది. ఈ నెల 25న రోహిణి కార్తె మొదలవుడుతోటే ఎవుసం పనులు షురువైతయి. యాసంగి వడ్లు ఇంకా సెంటర్లళ్లనే ఉండటం.. రుణమాఫీ గాక బ్యాంకులు లోన్లు ఇయ్యకపోవడంతో విత్తనాలు, ఎరువులకు, దున్నకాలకు పైసలెట్లా అని రైతులు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికిప్పుడు సెంటర్లలో వడ్లు కాంటా అయినా.. పైసలు ఇప్పుడొస్తయో రావోనని దిగులు పడుతున్నరు. బయట ఎక్కడన్నా అడుగుదామన్నా.. అప్పు పుట్టెటట్టు లేదు. దీంతో వానాకాలం సాగుకు పెట్టుబడి పైసల కోసం రైతులు పరేషాన్లవడ్డరు. 

ఇప్పటిదాకా 6 శాతం లోన్లే మాఫీ..

నాలుగు దఫాల్లో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన సర్కారు ఇప్పటి వరకు నాలుగేండ్లలో రూ.37 వేల లిమిట్​వరకు మాత్రమే మాఫీ చేసింది. సర్కారు మాఫీ చేస్తదని రైతులు అప్పులు కట్టలేదు. ఉన్న అప్పులు కూడా రెన్యూవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేదు. మూడేండ్ల నుంచి అప్పులు కట్టక అవి మొండి బకాయిలుగా మారినయి. దీంతో రాష్ట్రంలోని16 లక్షల మందికిపైగా రైతులు బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా మారారు. వాళ్లకు బ్యాంకులు కొత్తగా అప్పు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మొదటి దఫాగా సర్కారు రూ.25 వేల రుణాలున్న2.96 లక్షల మంది రైతులకు రూ.408.38 కోట్లు రుణాలు మాఫీ చేసింది. రెండో దఫా కింద రూ.50 వేల వరకు మాఫీ చేస్తామని చెప్పింది. ఇప్పటి వరకు రూ.37వేల వరకే రూ.763 కోట్లు మాఫీ చేసింది.  రాష్ట్రంలోని 36.68లక్షల మంది రైతుల పంట రుణాలు రూ.19,198.38 కోట్లు మాఫీ చేయాల్సి ఉంది. రెండు విడతల్లో కలిపినా రూ.1,171.38 కోట్లే మాఫీ జరిగింది. 6 శాతం మాత్రమే మాఫీ కాగా ఇంకా 94 శాతం మంది రుణాలు అలాగే ఉండిపోయాయి.  రుణ మాఫీ కోసం ఇంకా 32 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నరు.

పెట్టుబడి కష్టాలు..

రాష్ట్రంలో గుంట నుంచి రెండెకరాల లోపు ఉన్న రైతులే 32.02లక్షల మంది ఉన్నరు. రెండు ఎకరాల నుంచి ఐదెకరాల లోపున్న రైతులు 22.35 లక్షల మంది ఉన్నరు. మొత్తం రైతుల్లో 54.37లక్షల మంది ఐదెకరాల లోపు వాళ్లే ఉన్నరు. ఈ 85శాతం మంది రైతులకు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం ఏమాత్రం సరిపోతలేదు. సర్కారు ఇచ్చే సాయాన్ని కూడా అప్పు కట్టలేదని బ్యాంకర్లు పట్టుకుంటున్నరు. రైతుల అకౌంట్లు హోల్డ్​లో పెట్టి యాసంగి వడ్ల కొనుగోళ్ల పైసలు కూడా ఇవ్వడం లేదు. ఇదీగాక రోజుల తరబడి ధాన్యం సెంటర్లలో ఉండటంతో రైతులు దుక్కులు పొతం చేసుకునుడు ఈసారి ఆలస్యమవుతోంది. ఈ ప్రభావం పంట సాగుపైనా పడే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా వడ్ల కొనుగోళ్లలో వేగం పెంచడంతో పాటు, రుణమాఫీ చేసి రైతులకు కొత్త అప్పులు ఇచ్చేలా చూడాలి.

లోన్​ మాఫీ గాలే..

బ్యాంకుల లక్ష రూపాయల లోన్​ఉంది. సర్కారు మాఫీ చేస్తానంటే మేం కట్టలేదు. కొత్తగా లోన్​ అడిగితే పాత బాకీ కట్టాలంటున్నరు. వడ్లు ఇంకా సెంటర్లనే ఉన్నయి. అవి అమ్ముడు కాలే.. పైసలు రాలేదు. వానాకాలం ఎవుసంకు పెట్టుబడి కష్టమయ్యేటట్టు ఉంది.
- సుమతి, రైతు, మహబూబాబాద్ జిల్లా

రైతులను రుణ విముక్తుల్ని చేయాలి

సర్కారు రుణమాఫీ పూర్తి చేసి రైతులను ఆదుకోవాలి. పాత బాకీలు కట్టక, రుణాలు రీషెడ్యూల్ చేయక బ్యాంకులు రైతులకు లోన్లు ఇస్తలేవు. మా సర్వే ప్రకారం ఇప్పటి వరకు రైతులు దాదాపు రూ.20 వేల కోట్ల వరకు ప్రైవేటు వ్యాపారుల దగ్గర అప్పులు తీసుకున్నరు. తీసుకున్న అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నరు. పాసు పుస్తకాలు రాని వారికి కూడా బ్యాంకులు అప్పులు ఇస్తలేవు. 
- మూడ్ శోభన్, రాష్ట్ర సహాయ కార్యదర్శి, రైతు సంఘం