గుండుపిన్నుపై జాతీయ జెండాతో పరుగెడుతున్న మహిళ.. జగిత్యాల జిల్లా సూక్ష్మ కళాకారుడి సృష్టి

గుండుపిన్నుపై జాతీయ జెండాతో పరుగెడుతున్న మహిళ.. జగిత్యాల జిల్లా సూక్ష్మ కళాకారుడి సృష్టి

గుండు సూదిపై జాతీయ జెండాతో పరుగెడుతున్న మహిళ విగ్రహాన్ని తయారు చేసి ఆశ్చర్యపరిచాడు జగిత్యాల జిల్లా సూక్ష్మ కళాకారుడు. స్వాతంత్ర్య దినోత్సవం  సందర్భంగా జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ అతి సూక్ష్మ విగ్రహం తయారు చేశాడు. 

అతి సూక్ష్మ పరిమాణంలో గుండు పిన్నుపై జాతీయ జెండాను పట్టుకుని పరుగెడుతున్న మహిళ విగ్రహాన్ని తయారు చేయటంతో గుర్రం దయాకర్ ను స్థానికులు అభినందించారు. విగ్రహ తయారీకి దాదాపు 10 గంటల సమయం పట్టిందని ఈ సందర్భంగా తెలిపాడు. తయారీకి మైనం, పెన్సిల్, కలర్స్, గుండు పిన్ను ఉపయోగించినట్లు చెప్పాడు. 

చిన్న చిన్న వస్తువులపై సూక్ష కళాఖండాలను సృష్టిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు గుర్రం దయాకర్. ఇప్పటికే గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సాధించాడు.