పొద్దుతిరుగుడు కొనాలని రైతుల రాస్తారోకో

పొద్దుతిరుగుడు కొనాలని రైతుల రాస్తారోకో

ఇల్లంతకుంట, వెలుగు: పొద్దుతిరుగుడు పంట కొనుగోలు చేయాలని రైతులు ధర్నాకు దిగారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కేశన్నపల్లి పత్తికుంట పల్లె, తాళ్లపెల్లి, గాలిపెల్లి, ముస్కాన్‌‌‌‌‌‌‌‌పేటతో పాటు పలు గ్రామాల రైతులు గురువారం వంతడుపుల-కరీంనగర్ రహదారిపై బైఠాయించారు. గంటల తరబడి రాస్తారోకో చేపట్టినా ఆఫీసర్లు స్పందించకపోవడంతో ఇల్లంతకుంట మండల కేంద్రం వరకు పాదయాత్ర నిర్వహించారు. వివేకానంద విగ్రహం వరకు ర్యాలీగా చేరుకొని అక్కడై రోడ్డుపై బైఠాయించారు.

అనంతరం రోడ్డుపైనే వంటావార్పు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ... ప్రభుత్వం పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేయకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న మార్క్‌‌‌‌‌‌‌‌ఫెడ్‌‌‌‌‌‌‌‌ డీఎం హబీబుల్లా ఫోన్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడారు. పొద్దుతిరుగుడు కొనుగోళ్లపై ప్రభుత్వానికి నివేదిక పంపించామని, అక్కడి నుంచి స్పష్టమైన హామీ రాగానే కొనుగోళ్లు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.