- ఫాంహౌస్ రేవ్ పార్టీ పై.. మంచాల పోలీసుల రైడ్
రంగారెడ్డి జిల్లాలో ఫాంహౌజ్ రేవ్ పార్టీలు కలకలం రేపుతున్నాయి. అనుమతి లేకుండా మద్యం, మహిళలతో పార్టీలు.. పక్కా సమాచారంతో పోలీసుల రైడ్ ..పోలీసుల దాడుల్లో భారీగా నగదు, మద్యం, 25 మంది పురుషులు, 8 మంది మహిళలను పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డి జిల్లాలో మంచాల మండలం లింగంపల్లి ఫాంహౌజ్ లో అనుమతి లేకుండా రేవ్ పార్టీ జరుగుతుండగా పక్కా సమాచారంతో గురువారం ( అక్టోబర్16) పోలీసులు రైడ్ చేశారు. ఈ దాడుల్లో 25 మంది పురుషులు, 8 మంది మహిళలను అరెస్ట్ చేశారు. వారినుంచి రూ. 2లక్షల 40 వేల నగదు, 11 కార్లు, 15 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
►ALSO READ | బీసీ రిజర్వేషన్ బిల్లు పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
