
ఫుణె, భోపాల్: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఫుణె జిల్లాలో వ్యాన్ అదుపుతప్పి లోయలో పడింది. దీంతో ఎనిమిది మంది మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.
పాపల్వాడి గ్రామానికి చెందిన కొంత మంది వ్యానులో ఖేడ్ తహసీల్‌లో ఉన్న శ్రీ క్షేత్ర మహాదేవ్ కుందేశ్వర్ ఆలయానికి వెళ్తున్నారు. పైట్ గ్రామం వద్దకు రాగానే వ్యాన్ అదుపుతప్పి రోడ్డుపక్కనున్న 30 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మహిళలు చనిపోయారు. మరో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. పోలీసులకు సమాచారమిచ్చారు.
మధ్యప్రదేశ్‌లో ఐదుగురు..
మధ్యప్రదేశ్ అనుప్పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మోటార్ సైకిల్ ను ఢీకొట్టి జీపు బోల్తా పడటంతో ఐదుగురు చనిపోయారు.