రన్నింగ్ బస్సులో మంటలు.. తప్పిన ఘోర ప్రమాదం..

రన్నింగ్ బస్సులో మంటలు.. తప్పిన ఘోర ప్రమాదం..

తమిళనాడులో ఘోర ప్రమాదం తప్పింది. విద్యార్థులకు విహార యాత్రకు వెళ్తున్న  రన్నింగ్ లో ఉన్న స్కూల్ బస్సు నుంచి ఒక్కసారిగా మంటల చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై విద్యార్థులను కిందకు దించడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో 57 విద్యారర్థులు ప్రాణాలతో బయటపడ్డారు. మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. 

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని మెట్టు పాళయం సమీపంలో  ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెనకనుంచి వస్తున్న మరో బస్సు డ్రైవర్ అప్రమత్తం చేయడంతో బస్సు వెంటనే నిలిపివేసి విద్యార్థులను కిందకు దించేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలు అర్పేశారు. 

నమక్కల్ జిల్లా రాశీపురం ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 52 మంది విద్యార్థులు సహా 57 మంది అక్టోబర్ 6న ప్రైవేట్ బస్సులో ఊటీకి విహార యాత్రకు వెళ్లారు.  ఊటీలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించిన అనంతరం శనివారం రాత్రి ఊటీ నుంచి నమక్కల్‌కు తిరుగుపయనం అయ్యారు. మార్గమధ్యంలో మెట్టుపాళయం సమీపంలోని కాళ్లారు వంతెన దగ్గర వస్తుండగా బస్సు కుడి వెనుక టైరులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించని బస్సు డ్రైవర్ అలానే నడుపుతూనే ఉన్నాడు. అర్ధరాత్రి కావడంతో విద్యార్థులు కూడా నిద్రలో ఉన్నారు.

ఈ సందర్భంలో బస్సు వెనుక ఉన్నవస్తున్న మరో డ్రైవర్ మంటల గురించి తెలియజేశారు. దీంతో డ్రైవర్ బస్సును అక్కడికక్కడే నిలిపివేసి.. వారందరినీ కిందకు దించేశాడు. ఈ క్రమంలో గాలి వేగంతో బస్సులో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో ఇరుగుపొరుగు వారు మెట్టుపాళయం పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.